మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రామ్ చరణ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ కెరీర్ తొలినాళ్లలో తండ్రి సూచనల ప్రకారం స్క్రిప్ట్ లను ఎంచుకోగా ఇప్పుడు మాత్రం సొంతంగానే రామ్ చరణ్ కథలను ఎంచుకుంటున్నారు.అయితే రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉన్నారు.
చరణ్ ఏ పని చేసినా ఆ పని మెగా ఫ్యామిలీ గౌరవాన్ని పెంచే విధంగా ఉందే తప్ప తగ్గించే విధంగా లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతల హీరోగా రామ్ చరణ్ కు పేరుంది.
పలు సందర్భాల్లో ఏదైనా కారణం వల్ల నిర్మాత కొంతమేర తక్కువ పారితోషికం ఇచ్చినా ఫీల్ కాని హీరోగా రామ్ చరణ్ కు పేరుంది.ఫ్యాన్స్ కు రెస్పెక్ట్ ఇచ్చే హీరోలలో రామ్ చరణ్ ముందువరసలో ఉంటారు.
చేసిన సహాయాలను చెప్పుకోని టాలీవుడ్ హీరోలలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం.

రామ్ చరణ్ కు మొహమాటం ఎక్కువ కాగా రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఈ హీరో అస్సలు ఇష్టపడరు.రంగస్థలం సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించాలని సుకుమార్ చరణ్ కు సూచించగా ఆ సీన్ లో తాను నటించనని చెప్పారు.సుకుమార్ మాత్రం చరణ్ కు చెప్పకుండా సమంతను ఒప్పించి ఆ సీన్ ను పూర్తి చేయించారు.
సినిమాసినిమాకు నటుడిగా చరణ్ అంతకంతకూ ఎదుగుతున్నారు.

స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత డైరెక్టర్లకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చే హీరోగా చరణ్ కు పేరుంది.సినిమా ఫ్లాపైనా ఇతరులను బ్లేమ్ చేయడానికి ఇష్టపడని హీరోలలో చరణ్ ఒకరు.ఇతర స్టార్ హీరోలతో కూడా స్నేహపూర్వకంగా మెలిగే హీరోగా చరణ్ కు పేరుంది.
చరణ్ భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







