భార్యకు వెలకట్టలేని బహుమతి ఇచ్చిన ఆట సందీప్.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు సినీ ప్రేక్షకులకు డాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ తెలుగు సిని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.

 Aata Sandeep Special Gift To His Wife Jyothi Raj On Wedding Anniversary , Aata S-TeluguStop.com

ఇకపోతే ఆట సందీప్ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి పాటలకు సందీప్ స్టెప్పులను ఇరగదీస్తు ఉంటాడు.

అతను తన భార్య జ్యోతి ఇద్దరు కలసి కొన్ని వందల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టిక్ టాక్‌లోనూ వారి డాన్స్ తో ఒక ఊపు ఊపేసిన ఈ జంట ఇప్పుడు ఇన్ స్టా రీల్ వీడియోలు, ఫేస్ బుక్‌లోనూ డ్యాన్స్ వీడియోాలతో అదరగొడుతుంటారు.

ఇక ఈ జంట వేసే గ్రెస్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.ఇకపోతే ఆట సందీప్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడంతో సమాజ సేవలోనూ ముందుంటాడు ఆట సందీప్.ఇది ఇలా ఉంటే తాజాగా సందీప్ తన సతీమణి జ్యోతి రాజ్‌కు ఓ బహుమతి ఇచ్చాడు.

పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ బహుమతిని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

ఆ బహుమతి తన శ్రీమతికి చాలా ఇష్టమైనది, వెలకట్టలేనిది అని చెప్పుకొచ్చాడు సందీప్.తన భర్త ఇచ్చిన ఆ విలువైన బహుమతిని చూసి జ్యోతి ఎమోషనల్ అయింది.కాలి గజ్జెలను తీసి, తన శ్రీమతి కాళ్లకు తొడిగాడు.

అనంతరం జ్యోతి తన్మయత్వంతో నాట్యం చేసింది.అయితే నాట్య ప్రియులకు అందెలు అంటే ఎంతో మక్కువ అన్న సంగతి తెలిసిందే.

డాన్సర్ లకు అవి వెలకట్టలేని బహుమతి అవుతాయని అందుకే ఆట సందీప్ ఇలా తన భార్యకు అందెలను బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube