బండ్ల గణేష్ ఇంటర్వ్యూలు ఇస్తే కాంట్రవర్సీలు వస్తాయి.. ఎక్స్ ప్రెస్ హరి షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

 Controversies Will Come If Bandla Ganesh Gives Interviews Express Hari Comments-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇక ఈ కార్యక్రమం తరహాలోనే స్టార్ మాలో కామెడీ స్టార్స్ కార్యక్రమం కూడా ప్రసారం అవుతుంది.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి నాగబాబు శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా నేడు ప్రసారమైన ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ శేఖర్ మాస్టర్ స్థానంలో న్యాయనిర్ణేతగా వచ్చారు.

బండ్ల గణేష్ నటించిన డేగల బాబ్జి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బండ్ల గణేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ ప్రెస్ హరి డాన్స్ చేస్తూ వేదికపైకి వచ్చి మాట్లాడుతూ.

పెళ్లయిన మగాడి జీవితం బండ్ల గణేష్ మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూ లాంటిది.ఎంతో ప్రశాంతంగా ఇంటర్వ్యూ ఇద్దామన్న ఎక్కడో ఒకచోట ఫ్రస్టేషన్ వస్తుంది అంటూ బండ్ల గణేష్ పై కౌంటర్ వేశారు.

అదేవిధంగా ఎక్స్ ప్రెస్ హరి స్కిట్ లో మరొక అబ్బాయి బండ్ల గణేష్ ని చూపిస్తూ అన్న డాడీ పక్కన కూర్చున్నారు అతను ఎవరు అని అడుగుతారు.ఆ అబ్బాయి అలా అడగడంతో ఎక్స్ ప్రెస్ హరి సమాధానం చెబుతూ ఆయన పేరు బండ్ల గణేష్.ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఆయన సినిమాలు తీస్తే భారీ కలెక్షన్లు వస్తాయి అని సమాధానం చెప్పాడు.ఆ తర్వాత ఆ అబ్బాయి మరి బండ్ల గణేష్ ఇంటర్వ్యూలు ఇస్తే అంటూ ప్రశ్నించాడు.ఈ ప్రశ్నకు ఎక్స్ ప్రెస్ హరి సమాధానం చెబుతూ కాంట్రవర్సీలు వస్తాయి అంటూ తనదైన శైలిలో బండ్ల గణేష్ పై పంచ్ డైలాగ్ వేస్తూ అందరిని నవ్వించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube