తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న మహానాడులో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.పార్టీ అధికారంలోకి రావాలనే బలమైన ఆకాంక్షతో ఉన్న లోకేష్ చంద్రబాబు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంపైనా ఇప్పటికే ఆలోచనలు చేస్తున్నారు.
వరుసగా మూడుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన వారికి ఇకపై టికెట్ ఇవ్వకూడదనే ప్రతిపాదనలను టిడిపిలో తీసుకువచ్చారు.దీంతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ను టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో వేరొకరికి ఆ పదవిని అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అదే జిల్లాకు చెందిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు ఈ ప్రతిపాదన చేసినట్టు సమాచారం.దీంతో సోషల్ మీడియాలోనూ ఈ వ్యవహారంపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు ను ఆ పద నుంచి తప్పిస్తే… అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు టిడిపి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని లోకేష్ కసరత్తు చేస్తున్నారట.ఇదిలా ఉంటే అచ్చెన్న తీరుపై చాలాకాలంగా లోకేష్ కు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉంది.
అచ్చెన్న వ్యవహారశైలిని లోకేష్ మొదటి నుంచి ఇష్టపడే వారు కాదని, అయినా చంద్రబాబు, వైసీపీ ని ధీటుగా ఎదుర్కోవాలంటే అచ్చెన్న వంటి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కావాలనే అభిప్రాయం తో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ప్రైవేట్ సంభాషణలో పార్టీ లేదు బొక్క లేదు అంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలతో పాటు, చంద్రబాబు, లోకేష్ కు ఆగ్రహాన్ని కలిగించాయి.కానీ అప్పడు యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉండిపోయారు.కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అచ్చెన్న ను తప్పించే అవకాశాలు ఉన్నాయట.







