ఆ హీరోలు మిస్ చేసుకున్న కథలో బాలకృష్ణ నటించి సక్సెస్ సాధించారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమాలలో కొన్ని సినిమాలు ఇప్పటికీ మరుపురాని సినిమాలు గా మిగిలిపోయాయి.

 This Is The Balayya Blockbuster Movie That Victory Venkatesh And Sr Ntrmisse Bal-TeluguStop.com

అయితే మామూలుగా దర్శకులకు కానీ హీరో కానీ 99 సినిమాలు చేసినప్పటికీ 100వ సినిమా ఒక మరుపురాని సినిమానే అని చెప్పవచ్చు.అలా బాలకృష్ణ కూడా 99 సినిమాలు చేసిన తర్వాత తన 100వ సినిమాగా ఏ సినిమా చేయాలి? ఇటువంటి కథ ఎంచుకోవాలి అన్న విషయాలపై బాగానే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.ఈక్రమంలోనే బాలకృష్ణ తన 100వ సినిమా కోసం ఎన్నో కథలను కూడా విన్నారట.

ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వం లో రైతు అనే టైటిల్ తో ఒక సినిమా, బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం లో రామారావు గారు అనే టైటిల్ తో ఒక సినిమా ఇలా ఎంతో మంది దర్శకుల దగ్గర కథలు విన్నప్పటికీ చివరికి ఈ దర్శకుడు క్రిష్ రాసుకున్న ఆంధ్రప్రదేశ శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా రాసుకున్న కథ చెప్పడంతో పాటు ఈ సినిమాలో మీరు తప్ప ఎవరు నటించలేను అని చెప్పడంతో బాలకృష్ణ ఆ సినిమాకు ఓకే చెప్పేశాడట.

అలా ఈ సినిమా చిరంజీవి నటించిన 150 సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాతో పాటు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.

Telugu Balakrishna, Gauthamiputra, Senior Ntr, Tollywood, Venkatesh-Movie

అయితే శాతకర్ణి సినిమా అంటే సీనియర్ హీరోలతో చాలా ఇష్టమట.నీకోసం సీనియర్ హీరోలు అయిన ఎన్టీఆర్ ఈ సినిమాను చేయాలి అని అనుకున్నారట.ఎన్టీఆర్ శాత‌క‌ర్ణిగా,ఆయ‌న కుమారుడు పులోమావిగా వెంక‌టేష్‌ను న‌టింప‌జేయాల‌ని అనుకున్నారు.

శ్రీనాథ క‌విసౌర్వ‌భౌముడు సినిమాకు ముందు ఈ సినిమాను తీయాల‌ని అనుకుని.అందుకు క‌థ కూడా రెడీ చేయించారు ఎన్టీఆర్‌.

అయితే బాల‌య్య శాత‌క‌ర్ణికి, ఎన్టీఆర్ తీయాల‌నుకున్న సినిమా క‌థ‌కు తేడా ఏంటంటే ఎన్టీఆర్ రెడీ చేయించిన క‌థ‌లో పులోమావి స్టోరీకి కూడా ప్రాధాన్యం ఉంది.ఇక క‌థ రెడీ అయిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ 1994 ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయాల్లో మ‌ళ్లీ బిజీ కావ‌డంతో ఈ సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు.

అయితే దాదాపు 23 ఏళ్ల త‌ర్వాత అదే క‌థ‌లో బాల‌య్య నటించి సూపర్ హిట్ ను అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube