భారత దివంగత మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో జాతిపిత మహాత్మా గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉండేవని చెబుతుంటారు.ఈ విషయాన్ని నెహ్రూ పలుమార్లు వ్యక్త పరిచారు.
అయితే నెహ్రూ.భగత్ సింగ్ గురించి కూడా పలు లేఖలలో ప్రస్తావించారు.భగత్ సింగ్ గురించి నెహ్రూ ఒక లేఖలో ఇలా రాశారు.‘లాహోర్ నుంచి ఈ వార్త వెలువడిన్పటి నుంచి మనందరిలో ఒక విధమైన భావోద్వేగం ఏర్పడింది.దేశ ప్రజల మొర ప్రభుత్వం తప్పకుండా వింటుందని అందరూ ఊహించారు.అయితే అందుకు భిన్నంగా జరుగుతోంది.నా మనసుకు ఇది ఇబ్బందికరంగా మారింది.నా మనసులో ఆందోళన నెలకొంది.
ఇప్పుడు మనమంతా ఏమి చేయాలి? ఇక్కడ ఇప్పుడు మనమంతా సమావేశమయ్యాం.మనందరిలోన ఒకే ఆలోచన నెలకొంది.
భగత్ సింగ్ ఉరి కారణంగా దేశంలో ఉద్రిక్తత ఏర్పడింది.ఈరోజు భగత్ సింగ్ పేరు అందరి నాలుకలపై నానడానికి కారణం ఇదే.భగత్ సింగ్ మనందరికీ ఎంతో విలువైనవాడు.భగత్‌సింగ్ అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడు.
ప్రతి పల్లెటూరిలోని ప్రజలకు కూడా భగత్ సింగ్ గురించి తెలుసు.ఇక జవహర్‌లాల్ నెహ్రూ.మహాత్మా గాంధీ గురించి ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.నెహ్రూ ఒక వ్యాసంలో గాంధీజీ గురించి రాస్తూ.‘గాంధీ స్వచ్ఛమైన గాలికి ఉన్న బలమైన ప్రవాహం లాంటి మహనీయుడు.అతనికి మనం అండగా నిలవడంతోనే ఈ విజయం సాధ్యమయ్యింది.చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మనకు అంధకారమనే తెరను తొలగించారు.మనకు కాంతి కిరణంలా గాంధీజీ నిలిచారు.గాంధీజీ పలు విషయాలలో ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకువచ్చారు, ముఖ్యంగా కార్మికుల అభినందనలు అందుకున్నారు.అయితే గాంధీజీ ఎక్కడి నుంచో రాలేదు.
మన దేశంలోని కోట్లాది ప్రజల ఉత్పత్తే గాంధీజీ’ అని అని నెహ్రూ పేర్కొన్నారు.







