కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేశారు.కేంద్రంలో బీజేపీ సర్కారును ఎలాగైనా గద్దె దింపాలని ఆయన కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

 Telangana Cm Kcr Key Role In National Politics After Dasara Details, Telangana,-TeluguStop.com

జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించారు.ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో పాటు బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని వెల్లడించారు.దసరా తర్వాత జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారిస్తారని మల్లారెడ్డి స్పష్టం చేశారు.వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని విజయదశమి నాడు చక్రం తిప్పేందుకు కేసీఆర్ బయలుదేరతారని వెల్లడించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి ధ్వజమెత్తారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దివాళా తీసిందని.

అటు బీజేపీ దివాళా తీస్తోందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో దేశంలో ఏర్పడబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Amit Sha, Bandi Sanjay, Central Bjp, Kcr, Malla, Narendra Modi, National,

మోదీ నేతృత్వంలో బీజేపీ పూర్తిగా అబద్ధాల పార్టీగా తయారైందని… రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మలారెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో దళితబంధు, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మీ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని.ఈ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మల్లారెడ్డి సవాల్ చేశారు.దేశవ్యాప్తంగా కార్మికులు కేసీఆర్ పక్షాన నిలిస్తే మన బతుకులు బాగుపడతామని మల్లారెడ్డి ఆకాంక్షించారు.

గతంలో ఇక్కడి కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారు అని.ఇప్పుడు ఇతర రాష్ట్రాల కార్మికులు తెలంగాణకు వలస వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube