సీనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఇది సాధ్యమా.. ఒకే సినిమాలో ఏకంగా 5 పాత్రలతో?

తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినీ పరిశ్రమలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, అదేవిధంగా రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

 Senior Ntr Plays Five Characters In One Movie Details, Birthday, Senior Ntr, Sri-TeluguStop.com

అంతే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.తెలుగులో దాదాపుగా 200 కు పైగా సినిమాల్లో నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ గా ప్రసిద్ధిచెందాడు సీనియర్ ఎన్టీఆర్.

ఇకపోతే నేడు సీనియర్ ఎన్టీఆర్ 100 వ పుట్టినరోజు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇకపోతే ఎన్టీఆర్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా రాముడు భీముడు. ఆ తర్వాత త్రి పాత్రాభినయం లో నటించిన సినిమా దానవీరశూరకర్ణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ కర్ణుడిగా,కృష్ణుడిగా,దుర్యోధనుడిగా నటించారు.అంతే కాకుండా ఆ సినిమాకు ఎన్టీఆర్ నిర్మాతగా దర్శకుడిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు.

Telugu Ramudu Bheemudu, Senior Ntr, Sr Ntr, Tollywood-Movie

ఇకపోతే 1979లో విడుదలైన శ్రీమద్విరాట పర్వం సినిమాలో ఎన్టీఆర్ 5 పాత్రల్లో నటించి మెప్పించారు.ఆ సినిమాలో బృహన్నల, కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు పాత్రలో నటించి నట విశ్వరూపాన్ని చూపించారు.స్వీయ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమా లో రావణుడు గా కనిపించి ప్రతినాయకుడిగా కూడా తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయ పరంగా కూడా తనదైన సత్తాని చాటుకున్నారు.

ముఖ్యమంత్రిగా ఉంటూనే కథానాయకుడిగా నటించిన సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube