కోతులు అంటే చిలిపి చేష్టలకు, అల్లరికి కేరాఫ్ అడ్రస్.వాటి చేష్టలను తట్టుకోవడం ఎవరి తరం కాదు.
ఉన్న చోట ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ.చెట్ల మీద నుండి మరో చెట్టు మీదకి దూకుతుంటాయి.
అడవులు, గుట్టలకు దగ్గరగా ఉండే గ్రామాలలో కోతులు ఎక్కువగా వస్తుంటాయి.అవి ఇంట్లోకి ప్రవేశించి తినే పదార్థాలను పట్టుకుని కణాల్లో మాయమై పోతంటాయి.
ఏవో వాటి తిప్పలు అవి పడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ తిరుగుతుంటాయి.ఈ క్రమంలో అవి చేసే కొన్ని చేష్టలు ఎంతో నవ్వు కూడా తెప్పిస్తాయి.
కోతుల చేష్టలు నవ్వు తెప్పించే విధంగా ఉన్న ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా, మరో ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువతి కోతుల దగ్గరకు వెళ్లింది.అక్కడ కింద కూర్చుని సరదగా వాటితో సెల్ఫీ వీడియో రికార్డు చేస్తుంది.ఆమె వెనుకాల కొన్ని కోతులు ఉన్నాయి.అయితే, ఆమె కూర్చుని ఏదో తినడానికి పెడుతుందేమో అని కోతులు అనుకున్నాయి.
ఇంతలో ఒక కోతి ఆమె దగ్గరకు వచ్చింది.ఫోన్ లోని కెమెరాలో కోతి తన ప్రతి బింబాన్ని వింతగా చూసింది.
ఆమె ఒడిలో ఏదైన ఉందేమో అని చూసి… అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత.ఆ యువతి దగ్గరకు మరోక కోతి వచ్చింది.ఆ కోతి వస్తూనే యువతికి షాక్ కు ఇచ్చింది.
మెల్లగా యువతి దగ్గరకు వెళ్లి… ఆ యువతి డ్రెస్ కింద ఏమైన దాచిందేమో అనుకుని.డ్రెస్ ని పైకెత్తి చూసింది.
షాక్ కి గురైన యువతి వెంటనే తేరుకుని తన డ్రెస్ ను సర్దుకుంది.కోతి నేనేం చేశా.
అన్నట్లు అమాయకంగా ఆమె వంక చూసింది.ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు కోతి భలే రోమాంటిక్, అమ్మాయికి భలే షాక్ ఇచ్చిందంటూ కామెంట్ లు పెడుతున్నారు.