హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.చిలమత్తూరు మండలం కొడికొండలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించారు.
అనంతరం హిందూపురం బాలకృష్ణ ఫ్యాన్స్ టౌన్ వైడ్ ప్రెసిడెంట్ బండారు బాలాజీ కుమారుని వివాహా రిసెప్షన్ కు హాజరయ్యారు.నూతన వధూవరులను ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు గా ఉండాలని వారికి ఆశీస్సులు తెలిపారు.
హిందూపురం మండలం కొటిపి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అరుణాచల్ రెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు.సత్యనారాయణ స్వామి పూజ లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.
వారి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.







