చరణ్‌, బాలయ్య సినిమాల పుకార్లు.. వాటిపై క్లారిటీ ఇదుగో

తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్‌ మరియు శంకర్ ల కాంబో మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.రాజమౌళి స్థాయి దర్శకుడిగా శంకర్ కు పేరు ఉంది.

 Balakrishna And Ram Charan Movies Titles Clarity , Adhikaari Movie, Balakrishna,-TeluguStop.com

అద్బుతమైన కళా కండాలను ఆవిష్కరించిన ఘనుడు శంకర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి శంకర్ ప్రస్తుతం రామ్‌ చరణ్ తో సినిమా చేస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు అంతా కూడా సంతోషంగా ఉన్నారు.

ఈ సినిమా యొక్క టైటిల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది.శంకర్‌ సినిమా అంటే చాలా సందేశం.

ఆసక్తికర కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉంటాయి.కనుక ఈ సినిమా కు కూడా అందుకు తగ్గట్లుగా ఒక మంచి కమర్షియల్‌ టైటిల్‌ ను పెట్టాలనే ఉద్దేశ్యంతో అధికారిని ఖరారు చేశారనే వార్తలు వస్తున్నాయి.

ఇక బాలయ్య సినిమా ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు పలు టైటిల్స్ ను దర్శకుడు పరిశీలించాడు.చివరకు జై బాలయ్య అనే టైటిల్‌ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అఖండ సినిమా లో జై బాలయ్య పాట ఉండటం వల్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అందుకే ఏకంగా టైటిల్‌ గానే బాలయ్య పేరు ఉంటే ఖచ్చితంగా జై బాలయ్య సినిమా బాగుంటుందని దర్శకుడు అనుకుంటున్నాడట.జై బాలయ్య టైటిల్‌ దాదాపుగా కన్ఫర్మ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Adhikaari, Balakrishna, Jai Balayya, Ram Charan-Movie

ఈ రెండు సినిమాల టైటిల్స్ విషయంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది.మాకు తెలిసిన సమాచారం ప్రకారం శంకర్ అధికారి అని కాకుండా అన్ని భాషలకు ఒకే టైటిల్‌ సరిపోయే విధంగా అదే అర్థం వచ్చేలా ఒక టైటిల్‌ ను పరిశీలిస్తున్నాడు.అలాగే బాలయ్య మూవీ టైటిల్‌ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube