అమలాపురం మంటలు : అంతమందినీ అరెస్ట్ చేస్తారా ? 

కోనసీమ జిల్లాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చడం తో మొదలైన వివాదం అమలాపురం లో మంత్రి పినిపె విశ్వరూప్,  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాల దహనం తో పాటు,  మూడు ప్రభుత్వ ,ప్రైవేటు బస్సుల దహనం వరకు ఈ వ్యవహారం వెళ్ళింది.అప్పుడు రాజుకున్న ఈ పేరు మార్పు మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి.

 How Many Will Get Arrested In Amalapuram Riots Details, Amalapuram, Konamseema,-TeluguStop.com

దీనికి తగ్గట్లుగా రాజకీయ పార్టీలు దీనికి కారణం మీరు అంటే మీరు అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ రాజకీయాన్ని కొనసాగిస్తున్నాయి.ఇక ఈ ఆందోళనను మరింత ఉధృతం చెందకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
  ఈ ఘటన చోటు చేసుకున్న దగ్గర నుంచి అమలాపురం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.ఇక మరిన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఇది ఇలా ఉంటే ఈ ఘటనకు కారకుడిగా అన్యం సాయి అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఇతడు వైసీపీకి చెందిన వ్యక్తిగా జనసేన టిడిపి ఆరోపిస్తూ ఉండగా, ఇతడు జనసేన వ్యక్తి అని వైసిపి ఆధారాలను బయటపెడుతోంది.

ఇతడు విషయంలో ఇంకా స్పష్టత లేదు.ఇదిలా ఉంటే ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా ప్రాథమికంగా 200 మందిని గుర్తించారు.ఇంకా 800 మందికి  ఇందులో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు .వీరందరి వివరాలను సేకరించి వారి పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

Telugu Amalapuram, Anyam Sai, Appinipe, Jagan, Janasena, Konamseema, Ponnada Sat

వీరి పై సోషల్ యాక్టివిటీస్ పేరిట నమోదయ్యే సెక్షను నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి .ఏలూరు రేంజ్ డిఐజి ఈ కేసును విచారిస్తు ఉండడం తో త్వరలోనే దీనికి సంబంధించి పెద్దఎత్తున అరెస్టులు చోటు చేసుకోబోతున్నాయి .అలాగే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా పోస్టులను పెడుతున్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube