టెన్త్ రిజల్ట్స్ లో ప్రథమ గ్రేడ్ సాధించిన గౌతమ్.. ఇంకా ఎదగాలంటూ నమ్రత పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

 Gautam Achieved First Grade In Tent Results Namrata Shirodkar Post To Grow Up ,-TeluguStop.com

ఇకపోతే ఈయన పిల్లలు గౌతమ్ సితారల గురించి కూడా మన అందరికీ తెలిసిందే.సితార ఇంత చిన్న వయసులోనే తన టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

గౌతమ్ కూడా మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రంలో బాలనటుడిగా సందడి చేసి తన నటనతో మెప్పించారు.ఇక ప్రస్తుతం చదువులు రీత్యా వీరిద్దరూ చదువు పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గౌతమ్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల పదవ తరగతి ఫలితాలు కూడా వెలువడ్డాయి ఈ ఫలితాలలో గౌతమ్ ప్రథమ గ్రేడ్ సాధించారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన కొడుకు పై ప్రశంసలు కురిపించారు.అదేవిధంగా గౌతమ్ ను అభినందిస్తూ సుదీర్ఘమైన నోట్ కూడా రాశారు.

Telugu Grade, Gautam, Mahesh Babu Son, Class, Tollywood-Movie

ఈ సందర్భంగా నమ్రత గౌతమ్ గురించి చెబుతూ గౌతమ్ తాజాగా పదో తరగతి పూర్తి చేశాడని, పదవ తరగతి ఫలితాలలో తాను గ్రేడ్ 10 సాధించాడు.తన ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు.మరొక కొత్త దశలో కూడా ఇలాంటి చాలెంజ్ లను నువ్వు చేదించాలి.మీకు ఎల్లప్పుడు మేం అండగా ఉంటాము.నీవు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా…నీ విధికి నువ్వే రాజు, నీవు ఎల్లప్పుడు మమ్మల్ని ఇలాగే గర్వపడేలా చేస్తూ ఉండాలి అంటూ తన కొడుకు గురించి సుదీర్ఘమైన నోట్ రాశారు.ఇలా గౌతమ్ పదవతరగతి లో మంచి ఉత్తీర్ణత సాధించడంతో మహేష్ అభిమానులు సైతం గౌతమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube