రైట్ రైట్ : శ్రీకాకుళం టూ అనంతపురం ! మంత్రుల బస్సు యాత్ర నేడే

వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎక్కువగా జనంలో ఉండేందుకు జగన్ తో పాటు, ఆ పార్టీ నాయకులు ప్రాధాన్యం ఇచ్చేవారు.నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలతో కలిసి ఆందోళనలు నిర్వహించేవారు.

ఎన్నికలకు ఏడాది ముందు వైసిపి అధినేత ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సైతం ఏపీ అంతటా పాదయాత్ర నిర్వహించారు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ తరహా యాత్రలకు .జనాల్లోకి వెళ్లే కార్యక్రమాలకు పులిస్టాప్ పెట్టారు.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి జనాల్లోకి వెళ్ళకుండానే వాటిని అందించే ఏర్పాటు చేశారు.

ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే సర్వే రిపోర్టర్లతో జగన్ అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఇది ఇలా కొనసాగుతుండగానే.నేటి నుంచి ఏపీ లో ఎస్సీ ,ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులతో జగన్ బస్సు యాత్రను చేయిస్తున్నారు.

సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను మొదలుపెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు నాలుగు రోజుల పాటు ఈ యాక్టర్ కొనసాగుతోంది.

Advertisement

వైసిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు 17 మంది మంత్రులు ఈ బస్సు యాత్ర లో పాల్గొనబోతున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయం పదవులు మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యం కల్పించారు ఇలా అనేక అంశాలను ఈ యాత్రల ద్వారా వివరించనున్నారు.ఈ బస్సు యాత్ర మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, రంగస్థలం, పూసపాటిరేగ, నాతవలస జంక్షన్, డెంకాడ మీదుగా విజయనగరం చేరుకుంటుంది.శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగే బస్సు యాత్ర మధ్యమధ్యలో మంత్రులు బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు