కోలీవుడ్ లో సూర్య బాల కాంబినేషన్ కు సూపర్ క్రేజ్ ఉంది.నేటివిటీకి దగ్గరగా సహజత్వంతో సినిమాలు చేస్తారు డైరక్టర్ బాల.
సూర్యకి సూపర్ క్రేజ్ తెచ్చిన శివపుత్రుడు సినిమా అతని డైరక్షన్ లోనే తెరకెక్కింది.ఇప్పటికే బాల డైరక్షన్ లో సూర్య 3 సినిమాలు చేశారు.
ఇక ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత బాల డైరక్షన్ లో సూర్య సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని భావించిన ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది.
సూర్య నటిస్తూ నిర్మించాలని అనుకున్న ఈ ప్రాజెక్ట్ ని ఎందుకో అర్ధాంతరంగా ఆపేస్తున్నారని కోలీవుడ్ టాక్.
క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు.
వరుస ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న సూర్య బాలతో సినిమా ఎనౌన్స్ చేసే సరికి మరో అద్భుతమైన కల్ట్ క్లాసిక్ మూవీ వస్తుందని ఆశించారు.కానీ ఈ సినిమా స్టార్ట్ అవకుండానే ఆగిపోవడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.
సూర్య ప్రస్తుతం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్, విక్రం సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు సూర్య.బాల సినిమా ఆగిపోగా సూర్య నెక్స్ట్ సినిమా ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.







