టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.
అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ ది ఒక్కడిదే కాదు.కాబట్టి ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.
మరి ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
మొన్న బర్త్ డే జరుపుకున్న నేపథ్యంలో NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.ఆచార్య ప్లాప్ ను ఈ సినిమా హిట్ తో తుడిచి పెట్టుకు పోవాలని చాలా కష్టపడుతున్నాడు కొరటాల.
ఇక ఎన్టీఆర్ కొరటాల సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ను తీసుకున్న విషయం విదితమే.

ఈయన తెలుగులో అంతగా పేరు తెచ్చుకోక పోయిన తమిళ్ లో మాత్రం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు.ఇటీవలే ఈయన విజయ్ బీస్ట్ కోసం అందించిన అరబిక్ కుత్తు సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా అనిరుద్ అద్భుతమైన మాస్ బీట్స్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.అరబిక్ కుత్తు లాంటి మాస్ బీట్ నే ఎన్టీఆర్ కోసం రెడీ చేస్తున్నాడట.
ఇది తప్పకుండ మాస్ ఆడియెన్స్ ను అలరిస్తుందని అంటున్నారు.ఎన్టీఆర్ 30 సినిమాతో అనిరుద్ ఇక్కడ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోవడం ఖాయం అనిపిస్తుంది.
చూడాలి మరి ఈ సినిమా ఎలా అలరిస్తుందో.