నల్లగొండ జిల్లా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపు నీ డ్రామాలు.నీవి ఉత్తరకుమార ప్రగల్భాలేనని అందరికీ తెల్సు.
నీ సొల్లు పురాణం వినడానికి ప్రజలు సిద్దంగా లేరు.నల్లగొండలో జరుగుతున్న అభివృద్ది నీకు కనపడం లేదా?మతిభ్రమించి నిన్న నువ్వు మాట్లాడిన మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు.20 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్లగొండను అధోగతి పాలు జేసింది నువ్వు కాదా? నల్లగొండను సర్వనాశనం చేసింది నువ్వు కాదా? అంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడగొట్టి తరిమేస్తే భువనగిరికి పారిపోయి మళ్ళి ఇప్పుడు నల్గొండకు వచ్చి పగల్భాలు పలుకుతున్న కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటల్ని ప్రజలెవ్వరూ నమ్మరన్నారు.
ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రత్యేక దృష్టితో నల్గొండను అందంగా ముస్తాబు చేస్తుంటే ఓర్వలేక కోమటిరెడ్డి శాపనార్దాలు పెడ్తున్నారని మండిపడ్డారు.పేద విద్యార్దులకు వైద్య విద్యను అందించి,ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేందుకు సీఎం కెసీఆర్ నల్లగొండలో మెడికల్ కాలేజిని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తూ,ఐటీ మంత్రిగా ఉండి కూడా నల్లగొండకు ఐటీ హబ్ ను తేలేని అసమర్దుడు కోమటిరెడ్డని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు దగ్గర పడ్తున్నాయని,ఇప్పుడు వచ్చి నానా హంగమా చేస్తే ప్రజలు ఎవ్వరూ నమ్మరన్నారు.ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వంలో పల్లెలు,పట్టణాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయని,ఏ ఊరికి పోయినా తాము చేసిన అభివృద్ది కనపడ్తుందని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్ని డ్రామాలు వేసినా,ఎన్ని పగల్భాలు పల్కినా ప్రజలు నమ్మరని అన్నారు.