తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంతరంగా తన ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చేశారు.సుమారు పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా కెసిఆర్ పర్యటనలు చేస్తారని, ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై చర్చిస్తారని టిఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
దీనికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని మరి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు.తన పర్యటనలో అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి కీలక నేతలతో సమావేశం అయ్యారు.
ఢిల్లీ , పంజాబ్ లో జరిగిన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు.పంజాబ్ లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఆ తరువాత కర్ణాటక కు కెసిఆర్ వెళ్లాల్సి ఉన్నా.అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్ పయనం అయ్యారు.
అయితే కేసీఆర్ టూర్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.అయితే కేసీఆర్ తన పర్యటనను ఇలా ముగించడానికి కారణం మంత్రి కేటిఆరే నట. ప్రస్తుతం కేటీఆర్ దావోస్ పర్యటన ఉన్నారు.అక్కడ ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఆయన వెంట అనేకమంది అధికారులు వెళ్లారు.ఒకవైపు తాను ఢిల్లీలో ఉండడం … మరోవైపు కేటీఆర్ దావోస్ లో ఉండడంతో తెలంగాణలో పరిపాలన పడకేసింది అని, దీనిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వంపై మరింతగా ఎదురుదాడి పెంచడంతో కెసిఆర్ ఢిల్లీ టూర్ ను అర్ధాంతరంగా ముగించేసి నట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే మరోసారి అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకుని మరిన్ని ఎక్కువ రోజులు ఢిల్లీ కేంద్రం గా రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారట.ప్రస్తుతం వెళ్లి వచ్చిన ఢిల్లీ టూర్ పై కేసీఆర్ సంతృప్తిగా నే ఉన్నారట.







