బిగ్ బాస్ విన్నర్ బింధు మాధవికి దక్కింది అంత తక్కువా.. ట్యాక్స్ తీసేసి ఎంత ఇచ్చారంటే?

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ కు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.ఓటీటీలో మాత్రమే చూసే ఛాన్స్ ఉండటంతో ఆడియన్స్ లో చాలామంది ఈ షోకు కనెక్ట్ కాలేదు.

 Bigg Boss Show Winner Prize Money Details Here Goes Viral Bigg Boss ,  Bindhu Ma-TeluguStop.com

బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందు మాధవి నిలవగా చాలా వారాల నుంచి ఆమే విన్నర్ అవుతుందని ప్రచారం జరగడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలగలేదు.

సాధారణంగా బిగ్ బాస్ షో విన్నర్ గా నిలిచిన వ్యక్తికి 50 లక్షల రూపాయలు పారితోషికంగా దక్కుతుంది.

అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో 10 లక్షల రూపాయలు తీసుకొని హౌస్ నుంచి బయటకు రావడానికి అరియానా అంగీకరించడంతో ఆ మొత్తాన్ని బిగ్ బాస్ విన్నర్ రెమ్యునరేషన్ నుంచి కోత విధించారు.బిందుమాధవి 40 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ కాగా అందులో 32 శాతం ట్యాక్స్ గా చెల్లించాల్సి ఉంటుంది.

Telugu Akhil, Bigg Boss Show, Biggboss, Nagarjuna, Prize, Tollywood-Movie

ఈ విధంగా 28 లక్షల రూపాయలకు అటూఇటుగా మాత్రమే బింధు మాధవికి పారితోషికం దక్కిందని తెలుస్తోంది.మరోవైపు విన్నర్ గా నిలిచిన వాళ్ల పారితోషికంలో కోత విధించడంపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎంతో కష్టపడి విన్నర్ గా నిలిస్తే ఈ విధంగా చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ కామెంట్లపై బిందుమాధవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బిందు మాధవికి గత కొన్నేళ్లుగా సినిమా ఆఫర్లు రావడం లేదు.అయితే బిగ్ బాస్ షోకు విన్నర్ గా నిలవడంతో ఆమెకు సినిమా ఆఫర్లు పెరుగుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిందుమాధవి కెరీర్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.బిందు మాధవి కెరీర్ పరంగా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube