ఫ్లాపుల్లో ఉన్న ఐదుగురు డైరెక్టర్లకు హిట్లు ఇచ్చిన ఎన్టీఆర్.. రేర్ రికార్డ్ అంటూ?

సాధారణంగా ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి మిడిల్ రేంజ్ హీరోలు, యంగ్ హీరోలు ఇష్టపడరు.స్టార్ హీరోలు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం దాదాపుగా సాధ్యం కాదు.

 Young Tiger Ntr Rare Achievement Details Here Goes Viral Ntr , Tempare , Toll-TeluguStop.com

అయితే ఫ్లాపుల్లో ఉన్న ఐదుగురు డైరెక్టర్లకు హిట్లు ఇచ్చిన హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పేరుంది.ఈ విధంగా ఒక అరుదైన రికార్డును జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు.

ఇండస్ట్రీలో ఇలా చేయడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

బృందావనం సినిమాతో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ తో తెరకెక్కించిన ఈ సినిమా వంశీ పైడిపల్లికి మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఈ డైరెక్టర్ తొలి సినిమా మున్నా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అటు ఎన్టీఆర్ ఇటు పూరీ జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ఈ కాంబినేషన్ లో టెంపర్ సినిమా తెరకెక్కింది.

Telugu Flop Directors, Rare, Young Tiger Ntr-Movie

వక్కంతం వంశీ రాసిన కథ ఎంతగానో నచ్చి ఎన్టీఆర్ ఆ కథతో పూరీ డైరెక్షన్ లో నటించగా ఈ సినిమా హిట్ గా నిలిచింది.సుకుమార్ ఫ్లాప్ తో డీలా పడిన సమయంలో ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో బ్లాక్ బస్టర్ హిట్టైంది.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ వల్ల కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బాబీకి ఎన్టీఆర్ జై లవకుశ సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చారు.

Telugu Flop Directors, Rare, Young Tiger Ntr-Movie

జై లవకుశ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ఎన్టీఆర్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.అజ్ఞాతవాసి ఫ్లాప్ తో కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సంచలన విజయం సాధించింది.ఆచార్య ఫ్లాపైనా కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube