Apple సరికొత్త ఆవిష్కరణ: కళ్లులేనివారికి ఇకనుండి ప్రపంచాన్ని చూపెడుతుంది!

ఆపిల్ సంస్థ గురించి పరిచయం అక్కర్లేదు.టెక్నాలజీ రంగంలో అన్నింటికంటే ఎప్పుడూ ముందే ఉంటుంది.

 Apples Newest Invention Show The World To The Blind From Now On-TeluguStop.com

ఇక ఆపిల్ ఫోన్స్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఫోన్స్ కోసం జనాలు ఎంతగా పరితపిస్తారో చెప్పనవసరంలేదు.

కొంతమంది ఆపిల్ ఫోన్ ని స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతారు.డబ్బులు లేనివారు సైతం EMIల రూపంలో వీటిని కొని తమ డ్రీమ్ ని ఫుల్ ఫీల్ చేసుకుంటారు.

మరికొంతమంది తమ గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం వీటిని ఎరగా వాడతారు.అందుకే ఆపిల్ ఫోన్ కి విశ్వ వ్యాప్తంగా అంత డిమాండ్ వున్నది.

అందుకే ఈ సంస్థ తమ కస్టమర్లకోసం ఎప్పటికప్పుడు తన బ్రాండ్ వేల్యూని పెంచుకుంటూ పోతుంది.

ఈ క్రమంలోనే ఆపిల్ కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి కోసం కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రకటించింది.

తన రాబోయే కొత్త ఉత్పత్తుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తాజాగా ప్రకటించింది.వీటిల్లోని డోర్‌ డిటెక్షన్‌ అనే ఫీచర్ సాయంతో సదరు ద్రుష్టి లోపం వున్న వ్యక్తి సునాయాసంగా తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు.

ఇందులోని హార్ట్‌వేర్‌, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ద్వారా డోర్‌ హ్యాండిల్‌ను తిప్పాలా? పుల్‌ లేదా పుష్‌ చేయాలా? అనేది ఈజీగా తెలుసుకోగలుగుతారు.అదనంగా, డోర్‌పై ఇతర సంకేతాలు, చిహ్నాలు ఉంటే వాటినీ గుర్తించి అంతస్తుల్లో సరైన చోటుకు అది చేరవేస్తుంది.

డోర్‌ను కచ్చితంగా గుర్తించడానికి LiDAR ఫీచర్‌ కెమెరా, ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను వినియోగించనున్నట్లు యాపిల్‌ తెలిపింది.

అలాగే ఆపిల్ మ్యాప్స్‌ వంటి ఇతర యాప్‌లను కంపెనీ అప్‌డేట్‌ చేయాలని చూస్తోంది.

తద్వారా నావిగేషన్‌ ప్రారంభ, ముగింపు స్థానాల్లో వైబ్రేషన్‌, వాయిస్‌ ఓవర్‌ వంటి ఫీచర్లను మరింత ఇనుమడింప చేయనుంది.వినికిడి లోపం ఉన్నవారి కోసం లైవ్‌ క్యాప్షన్‌లను డిస్‌ప్లే చేసేలా ప్రయత్నాలూ చేస్తుంది.

ఇక యాపిల్ వాచ్ మిర్రరింగ్ సహాయంతో వినియోగదారులు తమ వాచ్‌ను రిమోట్‌గా ఉపయోగించుకోవచ్చు.ట్యాపింగ్‌ వంటి సంజ్ఞలతో కాల్స్‌, నోటిఫికేషన్స్‌, ప్లేబ్యాక్‌ మ్యూజిక్‌ను నియంత్రించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

అయితే, ఈ ఏడాది తర్వాత తీసుకొచ్చే కొత్త ఉత్పత్తుల్లో ఈ డోర్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube