తాజ్ మహల్:
గత కొన్నేళ్లుగా తాజ్ మహల్ విషయంలో కొందరు హిందూ, ముస్లింల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.కొందరు హిందువులు తాజ్ మహల్ నిజానికి శివాలయం అని చెబుతున్నారు.దీనిపై 2015లో ఆగ్రా కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ప్రహ్లాద్‌పురి ఆలయం (పాకిస్థాన్):
ఈ ఆలయం పాకిస్థాన్‌లోని ముల్తాన్ నగరంలో ఉండేది.హిరణ్యకశిపుని కుమారుడైన భక్త ప్రహ్లాదుడు. నరసింహావతారాన్ని పురస్కరించుకుని దీనిని నిర్మించాడని చెబుతారు.1992లో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు, పాకిస్తాన్ ప్రజలు ఈ పురాతన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
కుతుబ్ మినార్:
తాజ్ మహల్ మాదిరిగానే కుతుబ్ మినార్ విషయంలోనూ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.దీనిని 12వ శతాబ్దంలో ఇల్తుట్మిష్ నిర్మించిన టవర్ అని పిలుస్తారు.కొంతమంది హిందువులు ఇది ఒకప్పుడు హిందూమతంలోని ప్రసిద్ధ విష్ణు దేవాలయమని నమ్ముతారు.

గిర్నార్ దేవాలయం:
గిర్నార్ దేవాలయం గుజరాత్‌లోని జునాగఢ్‌లో జైన మతానికి చెందిన ప్రముఖ దేవాలయం.హిందూమతానికి చెందిన కొందరు ఈ ప్రదేశం హిందూ విశ్వాసాలకు ప్రతీక అని నమ్ముతారు ఇక్కడ దత్తాత్రేయుడు కొలువైవున్నాడంటారు.

జెరూసలేం (ఇజ్రాయెల్):
జెరూసలేం ఇజ్రాయెల్‌లో ఉన్న ఒక చిన్న నగరం.ఇక్కడ మూడు మతాల మత విశ్వాసం కనిపిస్తుంది.యూదుల ధార్మిక స్థలం ‘జెరూసలేం’ను అరబిక్ భాషలో అల్-ఖుదుస్ అంటారు.క్రైస్తవుల మెస్సీయ అయిన జీసస్ ఇక్కడే జన్మించాడని చెబుతారు.

తారీఖానే మసీదు (ఇరాన్):
ఇరాన్‌లోని దమ్‌ఘన్‌లో ఉన్న ఈ జొరాస్ట్రియన్ సూర్య దేవాలయం అక్కడి మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఒక మతపరమైన ప్రదేశం.8వ శతాబ్దంలో పార్సీ రాజు సస్సానిద్ అధికార పతనం తర్వాత, అది కూల్చివేసి, మసీదుగా మార్పునొందింది.ఇది ఇరాన్‌లోని పురాతన మసీదుగా గుర్తిస్తారు.అప్పుడప్పుడు పార్సీలు ఈ ఆలయాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు, అయితే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున వారు ఎల్లప్పుడూ అణచివేతకు గురవుతున్నారు.







