నాకు కప్పు వద్దు డబ్బు వద్దు.. ఫస్ట్ గేట్లు తియ్యండి.. నేను పోతా: బాబా భాస్కర్

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వడంతోనే అతని సీక్రెట్ రూమ్ లో పెట్టి ఫుల్ పుటేజ్ వచ్చేటట్టుగా చేశారు బిగ్ బాస్.

అయితే బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ రూమ్ అనేది వాడుకున్న వారికి వాడుకున్నంత ఎందుకంటే సీక్రెట్ రూమ్ వల్ల పర్ఫామెన్స్ స్కోప్ లభిస్తుంది.నలుగురితో నారాయణ అన్నట్టుగా కాకుండా సోలో పర్ఫామెన్స్ కి అవకాశం ఉండడం.

అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న బాబా భాస్కర్ కి మరొక బంపర్ ఆఫర్ ని కూడా ఇచ్చాడు బిగ్ బాస్.నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేయమని చెప్పగా తనకి వచ్చిన అవకాశాన్ని బాబా భాస్కర్ వేస్ట్ చేసుకోకుండా హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బిందు మాధవిని సేవ్ చేశాడు.

ఫస్ట్ స్టెప్‌తోనే బిందు ఫ్యాన్స్‌ని ప్రసన్నం చేసుకుని ఆట మొదలుపెట్టారు బాబా.ఆ తరువాత వరుసగా బాబాకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు.

Advertisement

ఎంటర్ టైనర్‌గా నిరూపించుకోవడానికి బోలెడు అవకాశాలు ఇచ్చారు.అలాగే హౌస్‌కి కెప్టెన్‌ని కూడా చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బాబా భాస్కర్ ఫినాలేకి చేరుకోవడంతో పాటు అతనికి సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా ప్లే చేశారు.ల

మొత్తానికి బిగ్ బాస్ బాబా భాస్కర్‌కి ఫుల్ హైప్ ని ఇచ్చారు.దాదాపు 35 నిమిషాల పాటు బాబా భాస్కర్‌ని ఆకాశానికి ఎత్తేసేశారు.ఇంత ప్రేమ తనపై చూపించడంతో ఆనందంతో పొంగిపోయారు బాబా.

నాకు నిజంగా ఏడుపు వచ్చింది.ఇంత బాగా చూపిస్తారని అనుకోలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వేరే లెవెల్ వీడియో.ఇది మూడు వీక్స్ ఫుటేజ్‌లా లేదు.87 డేస్ ఫుటేజ్‌లా ఉందని బాబా భాస్కర్ అన్నారు.ఆయన మాటల్లో అతిశయోక్తి కాదు.

Advertisement

అతని స్పెషల్ వీడియో నిజంగానే అలాగే ఉంది.అందుకే నా లైఫ్‌లో ఈ వీడియో చాలు.

ఈ కప్పు వద్దు.సొమ్ము వద్దు.

ఇప్పుడు గేట్ ఓపెన్ చేసినా వెళ్లిపోతా.బిగ్ బాస్ నాకు అంత సంతోషాన్ని ఇచ్చారు అని అన్నారు బాబా భాస్కర్.

తాజా వార్తలు