అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నట్లుగా నిలిచింది.
గత ఏడాది చివర్లో విడుదల అయిన పుష్ప సినిమా సీక్వెల్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు.
మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 సినిమా కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా గత ఏడాది డిసెంబర్ లోనే ప్రకటించారు.
కాని ఈ ఏడాది మే నెల కూడా వెళ్లి పోతుంది.అయినా కూడా ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభం అయిన దాఖలాలు కనిపించడం లేదు.
అసలు ఏం జరిగింది అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.ఎప్పుడెప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారి నుండి పుష్ప 2 సినిమా ప్రారంభం అయ్యింది అనే ప్రకటన వస్తుందా అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప 2 సినిమాను ఫిబ్రవరిలోనే ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు.అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ఇటీవల సుకుమార్ ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఆయన మౌనంగా ఉన్నాడట.
స్క్రిప్ట్ రెడీగానే ఉంది.షూటింగ్ మొదలు పెట్టడమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన సుకుమార్ ఇప్పుడు ఎందుకు మౌనం గా ఉన్నాడు అర్థం కావడం లేదు.
కనీసం జూన్ లేదా జులై లో అయినా సినిమాను మొదలు పెట్టేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పుష్ప 2 సినిమా హిందీ ప్రేక్షకుల వారికి తగ్గట్లుగా రూపొందించాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారట.
బాలీవుడ్ స్టార్స్ నటించే విధంగా పాత్రలను క్రియేట్ చేస్తున్నారట.అందుకే ఆలస్యం అవుతుందని కొందరి టాక్.