సలార్ క్రేజ్ మామూలుగా లేదు.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ఫాలోవర్స్!

ప్రస్తుత కాలంలో స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉన్న సమయంలోనే ఆ సినిమా పేరుతో అధికారిక సోషల్ మీడియా ఖాతాలను తెరవడం సర్వసాధారణం అయింది.ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్.

 Salaar Craze Is Next Level Followers Hugley In A Single Day Details, Slaar, Tol-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా 30 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడం కోసం మేకర్స్ Salaar The Saga పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను నిన్న ప్రారంభించారు.

ఈ క్రమంలోనే సలార్ సినిమా కోసం ఈ విధంగా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ప్రారంభించగా కేవలం 24 గంటలలోనే విపరీతమైన ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.కేవలం ఒక్క రోజులోనే 40 కే ఫాలోవర్స్ ను దక్కించుకుంది.ఈ క్రమంలోనే అధికారక ట్విట్టర్ ప్రారంభిస్తూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కు ఒక్కరోజులోనే 67.5కే లైక్స్ రావడం గమనార్హం.ఈ విధంగా ఈ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతాకు వచ్చిన ఫాలోవర్స్ అలాగే టైటిల్ పోస్టర్ కు వచ్చిన లైక్స్ చూస్తుంటే సలార్ క్రేజ్ విపరీతంగా ఉందని తెలుస్తోంది.

Telugu Followers, Prabhas, Prasanth Neel, Salaarsalaar, Salaar Saga, Salaar, Shr

ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా విడుదల విషయంలో బిజీగా ఉండగా, ప్రభాస్ కూడా రాధేశ్యామ్ సినిమా విడుదల విషయంలో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 30 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక ఈ రెండు సినిమాలు విడుదల కావడంతో వీరిద్దరూ ఈ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube