ఖమ్మం జిల్లా గ్రంధాలయం ముందు ఉద్యోగార్ధులు నిరసనకు దిగారు.
కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, చదువుకునేందుకు వస్తున్న వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని అన్నారు.
గ్రంధాలయం కి పది లక్షలు నిధులు మంజూరైనా సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.గ్రంధాలయ బాధ్యులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా స్పందన లేదని అందుకే నిరసనకు చేపట్టామన్నారు.
సుమారు రెండు వందల మంది డైలీ గ్రాంధాలయనికి వస్తున్నామని ఒక్క బాత్రూమ్ మాత్రమే ఉందని అన్నారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి తక్షణమే కనీస సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు.







