అతిలోక సుందరి, దివంగత నటి అయిన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జాన్వీ ఒకవైపు కెరిర్ పరంగా బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను,ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇది ఇలా ఉంటే శ్రీదేవి కూతురు గా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
నిర్మాత బోనీ కపూర్ కూతురిగా, శ్రీదేవి కూతురు గా కాకుండా జాన్వి ఒక స్టార్ హీరోయిన్ గా మారడానికి ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే ఆమె కెరీర్ ఆరంభం నుండే లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకోవడం అలాగే ఛాలెంజింగ్ పాత్రలు ఎంపిక చేసుకోవడం చేస్తోంది.

ఇకపోతే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇప్పటివరకూ ఫుల్ స్కిన్ షో చేసే పాత్రలు రాలేదు, చేయలేదు.వీటితో పాటుగా రొమాంటిక్ సన్నివేశాలలో హీరోలతో ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా ఇప్పటివరకు నటించలేదు.ఇకపోతే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే కథ డిమాండ్ చేసి ఆ సన్నివేశాలు సినిమాకు ఉపయోగపడతాయి అంటే అలాంటి సన్నివేశాలలో చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జాన్వికపూర్ ఇటీవల తన సన్నిహితుల వద్ద తెలిపిందట. బాలీవుడ్ మీడియాలోని ఒక వర్గం వారు జాన్వికపూర్ ను తక్కువ చేసి మాట్లాడడం తో పాటుగా విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారట.

శ్రీదేవి కూతురు అనే స్టార్ కిడ్ అని ఆమెను అంటున్నారట.దీంతో ఆమె తనకున్న స్టార్ కిడ్ అనే ముద్రను చెరిపేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.ఈ విషయంపై అభిమానులు కచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇంకా కాస్త ఆలస్యంగా అయినా జాన్వికపూర్ ఒక స్టార్ గా మారుతుంది స్టార్ కిడ్ అనే ఇమేజ్ నుండి బయటపడుతుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి జాన్వీకపూర్ చేస్తున్న ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈ విషయంలో ఆమె సక్సెస్ సాధిస్తుందా? లేదా తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.







