ఎవరి పిచ్చి వారిది.మనం ఆడవాళ్ళ అందాల పోటీలు చూశాం.
దురదృష్టం కొద్దీ మగవాళ్ల అందాల పోటీలు కూడా చూస్తున్నాం.ఇక అది చాలదన్నట్టు కొన్ని చోట్ల కోడి పుంజుల అందాల పోటీలు కూడా బాగా జరుగుతాయండోయ్.
ఏంటి అవాక్కయ్యారా? ఇది నిజం.కోడిపుంజు అందాల పోటీల్లో పాల్గొంటే.
ర్యాంప్ మీద ‘క్యాట్ వాక్’ చేస్తే ఎలా ఉంటుందో చూశారా? లేదు.అది కాక్ వాక్ అని చెప్పుకోవాలేమో.
ఇలాంటి బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు.కోడిపుంజు ర్యాంప్ పై ‘క్యాట్ వాక్’ చేయటమా? మరీ విడ్డూరంగా ఉందే అని అనుకుంటాం కదా.కానీ అక్కడ ప్రతి ఏటా కోళ్ల అందాల పోటీలు జరుగుతాయి.
ఇక అందాల పోటీలలో చక్కటి సిగతో అదేనండీ నెత్తిమీద కుచ్చుతో స్టేజీమీద హొయలు పోతు పలు కోడిపుంజులు చేసిన ‘క్యాట్ వాక్’ చూసి తీరాల్సిందే అని అంటున్నారు చూసినవారు.
ఇక అసలు వివరాల్లోకి వెళితే, మలేషియా దేశంలోని సెలంగోర్ రాష్ట్రంలో గల కంపూంగ్ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఒకటి హొయలు పోతూ.నడ్డి విరుచుకుంటూ చక్కగా ఏమాత్రం బెదరకుండా చక్కగా క్యాట్ వాక్ చేస్తుంటే.
అక్కడ వున్నవారు అందరూ చూసి వారెవ్వా ఏమి దీని సోకు అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.

‘సెరమా కోళ్లు’ అనివి తూర్పు ఆసియాకు చెందిన బాంటమ్ జాతి. వీటిని పెంచే యజమానులు వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచి చక్కటి ఆహారం పెట్టి ఇలా అందాల పోటీల్లో పాల్గొనేలా కోచింగ్ ఇస్తుంటారు.ఎందుకంటే, ఈ పోటీలో విజేతగా నిలిచిన కోళ్లకు భారీగా బహుమతులు దొరుకుతాయి మరి.ఇక ఈ జాతి కోళ్లు చాతీ ఉబ్బినట్లుగా ఉండి చక్కటి ఆకర్షణీయమైన వెంట్రుకలతో అందంగా కనిపిస్తాయి.ఇలాంటి జాతి కోళ్లు మనదగ్గర దొరకవు.
ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అవి అంతగా తట్టుకొని నిలబడలేవు.