జగన్ దెబ్బకు ఆదానీ భయపడ్డారా ?

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో కేంద్ర బిజెపి పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా గౌతమ్ ఆదాని పేరు చాలాకాలంగా మారుమోగుతూనే ఉంది.దేశవ్యాప్తంగానే కాక.

 Tdp Criticizes Adani Groups For Not Announcing Rajya Sabha Membership On Behalf-TeluguStop.com

ప్రపంచ దేశాలలోనూ ఆదానీ గ్రూప్స్ విస్తరించింది.దీంతో పాటు బీజేపీ కేంద్ర పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో అయన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూ వస్తోంది.

అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ గౌతం అదానీ పేరు మారుమోగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఏపీ నుంచి వైసీపీ కి నాలుగు స్థానాలు దక్కబోతుండడంతో ఈ రాజ్యసభ స్థానాల కోసం పార్టీలో పెద్ద పోటీనే నెలకొంది.అయితే ఇందులో ఒక స్థానాన్ని గౌతమ్ ఆదానికి కానీ, ఆయన భార్య ప్రీతి ఆదానికి కానీ అప్పగిస్తారు అనే ప్రచారం చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది.

ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త .రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పరిమల్ నత్వాని కి జగన్ రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు.ఆయనకు ఆ పదవి ఇచ్చే సమయంలో వైసీపీలో చేరాలనే షరతు విధించడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకునే రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించారు.

అయితే గౌతమ్ ఆదాని కానీ, ఆయన భార్య ప్రీతీ ఆదానికి కానీ ఈ విషయంలో ఇదే నిబంధన జగన్ విధించడంతో వారు వైసీపీలో చేరేందుకు ఇష్టం లేకనే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నట్లుగా వైసిపి ప్రచారం తీవ్రతరం చేశాయి.

దీనికి తగ్గట్లుగానే ఆదాని గ్రూప్స్ కీలక ప్రకటన చేసింది.రాజ్యసభ సీటు పై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆదానీ గ్రూప్ తాము ఏ రాజకీయ పార్టీలో చేరాలని.

పదవులు పొందాలని అనుకోవడం లేదని గౌతమ్ ఆదాని ప్రకటించారు.తమ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, తమకు ఎటువంటి పదవులు అవసరం లేదని గౌతమ్ ఆదానీ చేసిన ప్రకటన ఏపీ లో రచ్చ గా మారింది.

Telugu Adani, Ap Cm, Ap Cm Jagan, Houtham Adani, Jagan, Mukesh Ambani, Prithi Ad

ఆయన జగన్ , వైసీపీ ప్రభుత్వాన్ని చూసి భయపడ్డారు అని, అందుకే వెనక్కి తగ్గారు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.టిడిపి సోషల్ మీడియాలోనూ ఈ ప్రచారాన్ని ట్రేండింగ్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.దీనిపై వైసీపీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది.అసలు జగన్ గౌతమ్ ఆదానికి రాజ్యసభ సీటు ఇస్తానని ఎక్కడా చెప్పలేదని, ఇదంతా టీడీపి, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం అంటూ వైసిపి నాయకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube