యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండల కేంద్ర పంచాయితీ సర్పంచ్ పడాల వనిత,ఉప సర్పంచ్ తలారి హేమలత,గ్రామ పంచాయతీ సెక్రెటరీ లాలయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్ధారణ కావడంతో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.తుర్కపల్లి సర్పంచ్,ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ముగ్గురు కలిసి గ్రామపంచాయితీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 2021 మార్చి 31న వార్డు సభ్యుడు ఆకుల సతీష్ కుమార్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
దానిపై సమగ్ర విచారణ జరిపిన కలెక్టర్ వార్డు సభ్యుడు చేసిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.