యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట దేవస్థానం కొండక్రింద గండి చెరువు ప్రాంగణంలో గల శ్రీలక్ష్మీ పుష్కరిణిలో నీటిలో పడి బాలిక మృతి చెందిన సంఘటన విషాదం నింపింది.సాయంత్రం 4 గంటలు సమయంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొనుటకు హైదరాబాద్ నుండి యాదాద్రి చేరుకొన్న ఓ కుటుంబ సభ్యులు కోనేరులో స్నానం చేయడానికి వెళ్లారు.
లక్ష్మీ పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలిక మృతి చెందింది.మృతురాలు హైదరాబాద్ గుడి మల్కాపూర్ కి చెందిన బొంతల రోజా(15)గా గుర్తించారు.
దైవదర్శనానికి వచ్చి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.ఇదిలా ఉంటే బాలిక మృతితో లక్ష్మీ పుష్కరిణిలో భక్తులు స్నానం ఆచరించడానికి అనుమతి నిలిపేసి, సంప్రోక్షణ తదుపరి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.







