సీజన్ ఏదైనా విరి విరిగా లభించే పండ్లలో జామ ముందు వరసలో ఉంటుంది.తినేందుకు రుచిగా ఉండే జామ పండ్ల ధర తక్కువే అయినప్పటికీ.
పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అందులోనూ ఖాళీ కడుపుతో జామ పండును తీసుకుంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఖాళీ కడుపుతో జామను తింటే వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
షుగర్ పేషెంట్స్‌కు జామ ఓ వరమనే చెప్పాలి.జామలో ఉండే కొన్ని ప్రత్యేకమైన సుగుణాలు బ్లెడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.అందులోనూ జామ కాయను మధుమేహ వ్యాధి గ్రస్తులు పరగడుపున తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
అలాగే మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక జామ పండును తినాలి.
ఇలా చేస్తే జామలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఖాళీ కడుపుతో జామ పండును తినడం వల్ల.
అందులో ఉండే పలు పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డు కట్ట వేస్తాయి.ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.
సంతానోత్పత్తిని పెంచే సమర్థ్యం జామ పండ్లకు ఉంది.ఎవరైతే సంతాన లేమి సమస్యతో సతమతం అవుతున్నారో.వారు పరగడుపున ఒక జామ పండును తినాలి.తద్వారా జామలో ఉండే సుగుణాలు సంతానోత్పత్తిని పెంచే హార్మోల ఉత్పత్తిని రెట్టింపు చేస్తాయి.
ఇక ఖాళీ కడుపుతో జామను తినడం వల్ల బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు మెడదు పని తీరు సైతం మెరుగ్గా మారుతుంది.