సర్కారు వారి పాట మూవీని చూసిన స్టార్ హీరో బాలకృష్ణ.. అలా రియాక్ట్ అయ్యారంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ సాధారణంగా సినిమాలను చూడటానికి దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.తన తండ్రి సినిమాలు తప్ప ఇతర హీరోల సినిమాలను తాను ఎక్కువగా చూడనని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

 Star Hero Balakrishna Reaction About Sarkaru Vaari Paata Movie Details, Balakris-TeluguStop.com

అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాను మాత్రం బాలయ్య చూశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.బాలయ్య కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇదే బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో బాలకృష్ణ కూడా నటిస్తున్నారు.

ఈ రీజన్ వల్లే స్పెషల్ స్క్రీనింగ్ లో సర్కారు వారి పాట సినిమాను చూడటానికి బాలయ్య ఆసక్తి చూపించారని బోగట్టా.సినిమా చూసిన తర్వాత బాలయ్య పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని సమాచారం అందుతోంది.

చిత్రయూనిట్ ను బాలయ్య ప్రశంసించారని మహేష్ నటనను మెచ్చుకున్నారని తెలుస్తోంది.

Telugu Akhanda, Balakrishna, Balayyasarkaru, Boyapati Srinu, Parasuram, Keerthy

అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షో కోసం మహేష్ బాబు హాజరు కాగా బాలయ్య మహేష్ బాబు షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే.హీరో బాలకృష్ణ మహేష్ బాబుకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు.

Telugu Akhanda, Balakrishna, Balayyasarkaru, Boyapati Srinu, Parasuram, Keerthy

మరోవైపు బాలయ్య అఖండ సక్సెస్ జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.బాలయ్య తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube