ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రెబల్ చింతమనేని ప్రభాకర్ అందరికీ సుపరిచితులే.ఏదైనా ముఖంపై చెబుతూ… దూకుడుగా ఉంటూ టీడీపీలో చాలా యాక్టివ్ గా రాణిస్తూ ఉంటారు.2019 ఎన్నికలలో ఓడిపోయినా గాని ప్రభుత్వం తప్పు చేస్తే కచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉన్న చింతమనేని పై చాలా కేసులు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి.ఈ క్రమంలో 2011వ సంవత్సరంలో ఓ మహిళపై దాడి చేసినట్లు.
ఏలూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు… సుదీర్ఘ విచారణ అనంతరం చింతమనేని పై నమోదు చేసిన అభియోగాలు రుజువు కాలేదు.
దీంతో కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టివేయడం జరిగింది.
చింతమనేని పై అభియోగాలను పోలీసులు నిరూపించలేక పోయారని న్యాయస్థానం అభిప్రాయపడింది.దీంతో కేసును కొట్టి వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.
శుక్రవారం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగగా.చివరాఖరికి.
చింతమనేని పై అభియోగాలు రుజువు కాలేదని తెలియజేయడం జరిగింది.







