ఏదైనా పంక్షన్‌కి వెళ్లే ముందు ముఖం డల్‌గా, నిర్జీవంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.ఆ సమయంలో ఏం చేయాలో అర్థంగాక, ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం ఎలానో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటారు.
అసలు ఫంక్షన్‌కి వెళ్లాలన్న మూడు, ఉత్సాహం కూడా పోతుంటాయి.అయితే ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే అస్సలు వర్రీ అవ్వకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ ప్యాక్‌ను ట్రై చేస్తే ముఖం క్షణాల్లో వెలిగిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫేస్ ప్యాక్ ఏంటో.
ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ శెనగ పిండి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం మెల్ల మెల్లగా తడి చేతులతో రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంపై పేరుకు పోయిన డెస్ట్‌తో పాటు డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోయి ముఖం కాంతి వంతంగా, గ్లోయింగ్‌గా మారుతుంది.చర్మంపై అధిక జిడ్డు ఏమైనా ఉన్నా వదిలిపోతుంది.
మరియు డల్ నెస్ తగ్గి ముఖం అందంగా వెలిగిపోతుంది.కాబట్టి, తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్‌ను ట్రై చేయండి.