ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాలలో ఉన్న మరో కామన్ పాయింట్ ను మీరు గమనించారా?

సర్కారు వారి పాట సినిమాకు సైతం నెగిటివ్ టాక్ రావడంతో రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు జగన్ వల్లే ఫ్లాపయ్యాయంటూ ఒక వర్గం ప్రేక్షకులు జోరుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ కామెంట్లకు జగన్ అభిమానుల నుంచి కూడా ధీటుగా జవాబులు వినిపిస్తున్నాయి.

 One More Common Point Between Acharya Radheshyam Sarkaru Vaari Paata Details, Ac-TeluguStop.com

అయితే ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాలలో మరో కామన్ పాయింట్ కూడా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

రాధేశ్యామ్ సినిమా నిర్మాతలలో ప్రభాస్ చెల్లెలు ప్రసీద ఒకరు కాగా ఆచార్య సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేఖ నిర్మాతగా తెరకెక్కింది.

సర్కారు వారి పాట సినిమా నిర్మాతలలో మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ఈ కామన్ పాయింట్ ను ప్రస్తుతం ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

హీరోలు, హీరోల ఫ్యామిలీ మెంబర్స్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమాకు టాక్ నెగిటివ్ గా ఉన్నా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Common Point, Heroes, Mahesh Babu, Prabhas Sister,

మహేష్ బాబు ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.మహేశ్ తన సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

Telugu Acharya, Chiranjeevi, Common Point, Heroes, Mahesh Babu, Prabhas Sister,

సర్కారు వారి పాట సినిమా రిజల్ట్ గురించి బయ్యర్ల మధ్య కూడా చర్చ జరుగుతోంది.ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనే విధంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.శనివారం, ఆదివారం రోజులలో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.టికెట్ రేట్లను తగ్గిస్తే ఈ సినిమాకు బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube