గడిచిన కొన్ని నెలల్లో సౌత్ సినిమాలు బాలీవుడ్ లో అంచనాలను మించి విజయం సాధిస్తున్నాయి.పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 750 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.
హిందీ సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరుస్తుండగా సౌత్ సినిమాలు మాత్రం హిందీలో భిన్నమైన ఫలితాలను అందుకుంటున్నాయి.
అయితే మహేష్ బాబు బాలీవుడ్ వాళ్లు తనను భరించలేరని చెప్పారని కొన్నిరోజుల క్రితం ఫేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ విషయాన్ని తాను చెప్పలేదని మహేష్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.అయితే బాలీవుడ్ మీడియా మాత్రం మహేష్ బాబును టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం గమనార్హం.
మహేష్ వివరణ ఇచ్చినా బాలీవుడ్ మీడియా ఈ విధంగా వ్యవహరించడం గురించి మహేష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సౌత్ సినిమాలపై ఉన్న కోపంతో బాలీవుడ్ మీడియా ఈ విధంగా వ్యవహరిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాను టార్గెట్ చేసి కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే.హిందీ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఆదరించకపోతే సౌత్ సినిమాలను టార్గెట్ చేయడం ఏమిటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్ ప్రముఖులు సైతం మహేష్ పై రకరకాల కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మహేష్ హిందీని తక్కువ చెయ్యకపోయినా బాలీవుడ్ ప్రముఖులు మాత్రం మహేష్ గురించి అనవసరంగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మరోవైపు సర్కారు వారి పాట రిజల్ట్ మహేష్ బాబు అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.సర్కారు వారి పాట సినిమాలో ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచేలా ఉంది.170 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.







