ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా మామ మశ్చీంద్ర అని ఫిక్స్ చేశారు.ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సుధీర్ బాబు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా సుధీర్ బాబు అదరగొట్టాడు.సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అంతేకాదు ఈ సినిమాతో అతని స్క్రీన్ నేమ్ కూడా ఫిక్స్ చేశారు.
సుధీర్ బాబుకి నైట్రో స్టార్ అనే స్క్రీన్ నేమ్ పెట్టేశారు.
మామా మశ్చీంద్ర సినిమాను తెలుగుతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.సుధీర్ బాబు అక్కడ ఆల్రెడీ ఒక సినిమా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమాతో అక్కడ ప్రమోట్ అవ్వాలని చూస్తున్నాడు.
కమెడియన్ కం రైటర్ హర్షవర్ధన్ ఇదీరకు ఒక సినిమా డైరెక్ట్ చేసినా అది బయటకు రాలేదు.ఇప్పుడు సుధీర్ బాబుతో మామా మశ్చీంద్ర అంటూ ప్రయత్నం చేస్తున్నాడు హర్షవర్ధన్.
ఓ పక్క ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్న సుధీర్ బాబు ఆ సినిమాతో పాటుగా మామా మశ్చింద్రాతో డబుల్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.