సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట‘ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న అంటే రేపే గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ లో వేగం పెంచేశారు.
మహేష్ బాబు కూడా ప్రొమోషన్స్ లో జాయిన్ అవ్వడంతో ఈ సినిమా నుండి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
దీంతో ఈ సినిమా ప్రతి నిమిషం వార్తల్లో నిలుస్తూ మరింత హైప్ పెరిగేలా చేస్తుంది.తాజాగా ఈ సినిమాలోని మాస్ పాట గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మహేష్ ఒక మాస్ సాంగ్ కు ఊర మాస్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
ఈ మాస్ సాంగ్ ను స్వయంగా మహేష్ బాబు నే రెడీ చేయించారట.
ఇలాంటి ఊపు ఉన్న పాటనే కావాలని మహేష్ బాబు కోరడంతో ఇది రెడీ చేశారట.ఈ సినిమాలో మహేష్ మరోసారి తనలోని మాస్ యాంగిల్ ను బయటకు తీయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా మాకు ఇదే కదా కావాల్సింది అంటూ ఖుషీగా ఉన్నారు.
ఈ సినిమా కోసం ముందు ఒక మెలోడీ సాంగ్ ను షూట్ చేశారట.

అయితే ఆ తర్వాత మహేష్ బాబు మాస్ సాంగ్ ఉండాల్సిందే అని కోరడంతో థమన్ అప్పటికప్పుడు మ.మ.మహేశా సాంగ్ ను రెడీ చేసి ఇచ్చారట.మరి మహేష్ అనుకున్నట్టు ఈ పాటతోనే మంచి ఊపు వచ్చింది.మెలోడీ ప్లేస్ లో మాస్ బీట్ పెట్టి మహేష్ బాబు మంచి పని చేసారని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
ఈ పాట రెడీ అయినా వెంటనే ప్రత్యేకంగా సెట్ వేసి ఈ పాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు.ఈ విషయాన్నీ మహేష్ స్వయంగా తెలిపారు.థియేటర్ లో ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తారు అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.







