ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్టైనా చరణ్, ఎన్టీఆర్ హ్యాపీగా లేరా.. ఇవే కారణాలు అంటూ?

ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఫుల్ రన్ లో 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

 Charan Ntr Not Happy With Rrr Industry Hit Details, Charan, Ntr, Ram Charan, Ach-TeluguStop.com

అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించినా ఈ ఇద్దరు హీరోలకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరు హీరోల ఆనందం ఆవిరి కావడానికి ఒక విధంగా ఆచార్య సినిమా కారణమని తెలుస్తోంది.

ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో చరణ్ ఖాతాలో ఫ్లాప్ చేరింది.

అదే సమయంలో ఎన్టీఆర్ తర్వాత సినిమాకు కొరటాల శివ డైరెక్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ కు, ఎన్టీఆర్ అభిమానులకు ఒకింత టెన్షన్ అయితే ఉంది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను కేజీఎఫ్2 సులువుగా దాటేసింది.ఆర్ఆర్ఆర్ రికార్డులు సినిమా రిలీజైన కొన్ని వారాలకే బ్రేక్ కావడం కూడా ఎన్టీఆర్, చరణ్ కెరీర్ పై ప్రభావం చూపుతోంది.

మరోవైపు జక్కన్న సెంటిమెంట్ వల్లే చరణ్ నటించిన ఆచార్య ఫ్లాపైందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జక్కన్న సెంటిమెంట్ ఎన్టీఆర్ పై కూడా ప్రభావం చూపితే తారక్ తర్వాత సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Acharya, Charan, Charan Projects, Koratala Shiva, Rajamouli, Kgf Chapter,

రాజమౌళి సినిమా కోసం తారక్ నాలుగేళ్ల సమయం కేటాయించిన విషయంలో సైతం అభిమానులు అయితే హ్యాపీగా లేరని తెలుస్తోంది.జక్కన్న సినిమాతో సక్సెస్ దక్కినా హీరోలకు బాక్సాఫీస్ వద్ద అనుకూల పరిస్థితులు లేవు.

Telugu Acharya, Charan, Charan Projects, Koratala Shiva, Rajamouli, Kgf Chapter,

ఎన్టీఆర్, చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.ఈ సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్స్ లీకవుతూ ఉండటం అభిమానులను ఎంతగానో కలవరపెడుతోంది.ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకొని టాలీవుడ్ ఖ్యాతిని పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube