ఆ సమయంలో మహేష్ బాబు దంపతులు ఎంతో సహాయం చేశారు.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ హీరో అడవి శేష్ ఎన్నో విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన సినిమాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు.

 At That Time Mahesh And Namrata Supported Me A Lot By Adavi Shesh, Mahesh Babu,-TeluguStop.com

ఇకపోతే తాజాగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మేజర్.ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర రావడంతో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ ట్రైలర్ ఈవెంట్లో భాగంగా మహేష్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో భాగంగా హీరో అడవి శేషు మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్ అని.అమ్మ, నాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రెండ్ అన్ని ఒక సాధారణ వ్యక్తిలా అతని జీవితం కొనసాగిందని తెలిపారు.

Telugu Adavi Shesh, Mahesh Babu, Namratha, Tollywood-Movie

ఈ విధంగా నిజ జీవితంలో సాధారణ జీవితం గడిపే సందీప్ ఉన్నికృష్ణన్ అసాధారణమైన వ్యక్తిగా ఎలా మారారు అనే విషయం సినిమాలో చూస్తారని అడవి శేషు వెల్లడించారు.ఇక ఈ సినిమాలో తను నటించడానికి మహేష్ ప్రధాన కారణమని ఆయన ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారని మహేష్ బాబు గురించి అడవి శేషు వెల్లడించారు.కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలోమహేష్ బాబు నమ్రత దంపతులు తనకు అండగా నిలబడే తనని నిలబెట్టారని ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి అడవి శేష్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube