విజయ్ దేవరకొండ స్టార్ హీరో అవుతాడని వాళ్ళ నాన్నకి అప్పుడే చెప్పా: బండ్ల గణేష్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ నెల 9వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

 Bandla Ganesh Wishes Vijay Devarakonda On His Birthday Details, Bandla Ganesh,-TeluguStop.com

ఈ క్రమంలోనే నిర్మాత బండ్ల గణేష్ కూడా హీరో విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ… విజయ్ దేవరకొండ భవిష్యత్తులో స్టార్ హీరో అవుతారని అతను పుట్టినప్పుడే వాళ్ళ నాన్నతో చెప్పానని బండ్ల గణేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.నాకు ఇప్పటికీ గుర్తుంది మే 9వ తేదీ మీ నాన్న వచ్చి నాకు కొడుకు పుట్టాడని చెప్పారు.

వెంటనే ఆ కుర్రాడు స్టార్స్ తో ఆశీర్వదింపబడ్డాడని చెప్పాను.విజయ్ అందరూ కలిసి నిన్ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టారు.హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా బండ్ల గణేష్ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ ట్వీట్ చూసిన విజయ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ బండ్ల గణేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్థాయిలో నటించిన లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.అలాగే పూరి దర్శకత్వంలో జనగణమన శివ నిర్వాణ దర్శకత్వంలో మరొక సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube