అదృష్టం అంటే ఇదే మరీ.. ఫీనాలేలోకి నేరుగా బాబా భాస్కర్!

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితి లు ఎప్పుడూ ఏవిధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.అంతేకాకుండా బిగ్ బాస్ షోనీ రక్తికట్టించేవి రెండే రెండు కాగా అవి ఒకటి నామినేషన్ రెండవది ఎలిమినేషన్.

 Bigg Boss Non Stop Baba Bhaskar Not Used Eviction Free Pass Anyone , Bigg Boss N-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ లో కొన్ని కొన్నిసార్లు ఎలిమినేషన్ కూడా కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది అనడానికి తాజాగా జరిగిన ఎపిసోడ్ ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఇటీవల 8వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు బాబా భాస్కర్.

అయితే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ ఒక్కొక్కరిని వెనక్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు.అయితే దానిని డేంజర్ జోన్ లో ఉన్న అరియానా, అషు రెడ్డి లపై వాడవచ్చు అని బిగ్ బాస్ నాగార్జున చెప్పాడు.

అంటే హోస్ట్ నాగార్జునచెప్పిన ప్రకారం.వారిద్దరిలో ఒకరు వెళ్లిపోవాలా వద్దా అన్నది కూడా బాబా భాస్కర్ నిర్ణయించాలి.ఈ క్రమంలో నాగార్జున ఒక చిన్న మెలిక పెట్టాడు.ఈసారి తాను ఎలాగో నామినేషన్స్ లేడు కాబట్టి ఈ వారం ఎవరినైనా సేవ్ చేయడానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడవచ్చు లేదంటే వచ్చేవారం తాను నామినేషన్ నుంచి గట్టెక్కడానికి దానిని ఉపయోగించవచ్చు అని తెలిపాడు.

అప్పుడు బాబా భాస్కర్ దానిని ఎవరికోసమో ఎందుకు తన కోసమే తాను ఉపయోగించుకుంటాను అని చెప్పేశాడు.దీనితో తక్కువ ఓట్లు పడ్డ అషు రెడ్డి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

Telugu Ariyana, Ashu Reddy, Baba Bhaskar, Bigg Boss, Nagarjuna-Movie

ఇక ఎలాగో బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తన కోసమే వాడుకుంటాడు కాబట్టి 11వ వారం నామినేషన్స్ లో ఉండడు.ఒకవేళ 11వ వారం మధ్యలో సడన్ గా ఎలిమినేషన్ ఉన్నా కూడా వీకెండ్లో డబల్ ఎలిమినేషన్ ఉన్న బాబా భాస్కర్ నేరుగా టాప్-6లో చోటు దక్కించుకోవడం ఖాయం అని తెలుస్తోంది.ఇక ఈ లెక్కన చూసుకుంటే బిగ్ బాస్ ఓటీటీ లో మొదటి పైన లిస్టుగా బాబా భాస్కర్ చరిత్ర సృష్టించబోతున్నారు అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube