రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన విరాట పర్వం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.వేణు ఉడుగుల దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఊరిస్తున్న విషయం తెలిసిందే.
అనారోగ్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి.ఇక కరోనా కారణంగా సినిమా విడుదల ఏకంగా రెండు సంవత్సరాలకు పైగానే వాయిదా పడుతూ వచ్చింది.
డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేయాలని నిర్మాత సురేష్ బాబు భావించారనే వార్తలు వచ్చాయి.కానీ ఈ సినిమాకు ఉన్న అంచనాల నేపథ్యం లో థియేట్రికల్ రిలీజ్ చేస్తే భారీ లాభాలు వస్తాయనే ఉద్దేశం తోనే సురేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక మార్కెట్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.
కనుక ఆమె నటించిన సినిమా అంటూ విరాట పర్వం సినిమా ను ప్రమోట్ చేసే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.విరాట పర్వం సినిమా కి ఆమె పాత్ర మరియు ప్రమోషన్ అత్యంత కీలకంగా మారింది.
ఎందుకంటే విరాట పర్వం సినిమా తర్వాత ఆమె ఎక్కువ గా సినిమా లు చేయాలని అనుకోవడం లేదు.అందుకే ఇప్పటి వరకు ఆమె ఒక కొత్త సినిమా కూడా కమిట్ కాలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి టాక్.

అందుకే సాయి పల్లవి విరాట పర్వం సినిమా తో మరో సారి తన హీరోయిక్ స్టార్డం ను నిరూపించు కోవడం ఖాయం అంటూ ఆమె అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.సినిమా లో రానా హీరో గా నటించిన కూడా సాయి పల్లవి పేరు తోనే విరాట పర్వము ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు.తద్వారా మంచి బిజినెస్ అయ్యే అవకాశాలున్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.మొత్తానికి సినిమా పూర్తి ప్రమోషన్ బాధ్యత ను కూడా సాయి పల్లవి భుజాలపై పెట్టేశారు.







