యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ మరింత సంతోషంగా ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.
దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు అఖిల్ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
అందుకు కారణం కూడా ఉంది.ఈయన ఏజెంట్ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నాడు.
ఈ విషయాన్నీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.అయితే ఈయన సినిమాకు రోజురోజుకూ పోటీ పెరుగుతుంది.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు పోటీ పెరిగిపోవడంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్టు టాక్.ఈ సినిమా కు తన అన్న చైతన్య నుండి పోటీ ఎదురవుతుంది.
ఈయన నటించిన హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా అదే వారంలో రిలీజ్ కాబోతుంది.

ఇది అమీర్ ఖాన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఆ తర్వాత సమంత కూడా అఖిల్ సినిమాకు పోటీ పడుతుంది.ఈమె యశోద సినిమా ఆగష్టు 12నే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది.
అన్న, మాజీ వదినే అనుకుంటే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమా కూడా అఖిల్ తో పోటీకి సై అంటుంది.నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట.

అసలు ఈ సినిమా జులై 8న రిలీజ్ కావాల్సి ఉంది.కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాదు అని అనుకున్న టీమ్ ఈ సినిమాను నెల ముందుకు జరిగి ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నారట.మరి అఖిల్ కు ఇంత పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఈయన సినిమా ఏ మాత్రం నిలబడి ముందుకు వెళుతుందో చూడాలి.







