టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.రోజు రోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.
విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.
సోషల్ మీడియాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుని టాలీవుడ్ లోనే టాప్ 2 ప్లేస్ లో నిలబడ్డాడు.
అయితే మాములు విజయ్ గా ఉన్న ఈయన రౌడీ స్టార్ గా మారడానికి చాలానే కష్టపడ్డాడు.
ఈయన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మనమంతా చూస్తున్నది.విజయ్ 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించాడు.
ఈయన కుటుంబం నాగర్ కర్నూల్ సమీపంలోని తుమ్మన్నపేట.అక్కడి నుండి విజయ్ తండ్రి హైదరాబాద్ కి వచ్చి స్థిరపడ్డాడు.
ఈయన తండ్రి గోవర్ధన్ కొన్ని టీవీ సీరియల్స్ ను డైరెక్ట్ చేసారు.

విజయ్ చిన్న తనంలోనే ఒక ప్రచారం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.ఆ తర్వాత విజయ్ దేవరకొండ బి కామ్ వరకు చదువుకుని నటనపై ఉండే మక్కువ కారణంగా సినిమాల్లోకి వచ్చి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.ఈయన మొదటగా నువ్విలా సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా నటించాడు.
అయితే విజయ్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా ఏది అంటే పెళ్లి చూపులు అనే చెప్పాలి.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమాతో మొదటి హిట్ కొట్టడమే కాకుండా ఈయన నటుడిగా హీరోగా గుర్తింపు కూడా పొందాడు.
ఆ తర్వాత చేసిన అర్జున రెడ్డి తో స్టార్ అయిపోయాడు.ఇక అక్కడి నుండి ఈయన వెనుతిరిగి చూసుకోవడం లేదు.
ప్రెసెంట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్‘ సినిమా చేస్తున్నాడు.మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.
ఈ సినిమా కోసం గత రెండు ఏళ్లగా కష్టపడుతున్నాడు విజయ్.

ఈ సినిమా తర్వాత కూడా విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే జనగణమన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత జోడీగా మరొక సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు.ఇలా మాములు విజయ్ గా ఉన్న ఈయన ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా రౌడీ స్టార్ అని అభిమానులతో పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు.
మరి ఈ సినిమాలు కూడా విజయ్ కు సక్సెస్ తెచ్చిపెట్టి ఈయన కీర్తి మరింతగా ఎదగాలని ”తెలుగు స్టాప్” మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.







