మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు 125 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.సర్కారు వారి పాట నైజాం హక్కులు 36 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
సర్కారు వారి పాట సీడెడ్ హక్కులు 13.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.ఈ సినిమా ఉత్తరాంధ హక్కులు 13 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా.సర్కారు వారి పాట ఉభయ గోదావరి జిల్లాల హక్కులు 15.5 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.ఈ సినిమా గుంటూరు ఏరియా హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.సర్కారు వారి పాట కృష్ణా జిల్లా హక్కులు 7.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
సర్కారు వారి పాట నెల్లూరు జిల్లా హాక్కులు 4 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.సర్కారు వారి పాట ఏపీ, తెలంగాణ హక్కులు 98.5 కోట్ల రూపాయలకు అమ్ముడవడం గమనార్హం.సర్కారు వారి పాట ఓవర్సీస్ ఓవర్సీస్ హక్కులు 11 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.ఈ సినిమా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా హక్కులు 23.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా.

సర్కారు వారి పాట శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం.మహేష్ గత సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమాకు పాతిక కోట్ల రూపాయలు అదనంగా బిజినెస్ జరిగింది.టికెట్ రేట్ల పెంపు వల్ల ఈ సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.ఈ సినిమాతో మహేష్, కీర్తి సురేష్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.పరశురామ్ ఈ సినిమాను అద్భుతమైన స్క్రిప్ట్ తో తెరకెక్కించారని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







