మమ మహేషా పాట ఆ రెండు పాటలకు కాపీనా.. ఆ పాటలను కాపీ కొట్టారంటూ?

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట సినిమా నుంచి తాజాగా మ మ మహేషా సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.ప్రేక్షకుల నుంచి ఈ పాటకు పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ పాటకు ఇప్పటివరకు 8.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించగా మహేష్ బాబు, కీర్తి సురేష్ స్టెప్పులు ఈ సాంగ్ కు హైలెట్ గా నిలవడం గమనార్హం.

 Netizens Trolling Sarkaru Vaari Paata Mama Mahesh Song Details Here Sarkaru Vaa-TeluguStop.com

అయితే ఈ పాట కాపీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే థమన్ గతంలో మ్యూజిక్ అందించిన పాటల నుంచి ఈ పాటను కాపీ కొట్టారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఛల్ మోహన రంగా సినిమాలోని ఫస్ట్ లుక్కు సోమవారం నుంచి మమ మహేషా సాంగ్ పల్లవిని సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ నుంచి ఈ పాట చరణాలను కాపీ కొట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Copy, Keerthi Suresh, Mahesh Babu, Mama Mahesha, Parasuram, Sarkaaruvaari

థమన్ మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇచ్చిన పాట కాపీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.థమన్ ఈ విమర్శల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సర్కారు వారి పాట సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

తెలంగాణ సర్కార్ కూడా ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.సర్కారు వారి పాట సినిమా 140 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube