ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించ బోతున్నారు.నాగ్ అశ్విన్ చేసింది రెండే సినిమాలు అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
రెండు సినిమాల తోనే ఏకంగా డార్లింగ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
ఈ సినిమాలో ఇప్పటికే ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.ఈమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని కొద్దీ భాగం షూట్ కూడా అయ్యింది.
అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఉన్నట్టు ఇప్పుడు అఫిషియల్ గా తెలుస్తుంది.మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ ఈ సినిమాలో భాగం కానుంది అని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తనకి ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినా వైజయంతి మూవీస్ వారి నుండి వచ్చిన ఆహ్వానాన్ని పంచుకుంది.

ఈ పోస్ట్ తో ఈమె ఈ ప్రాజెక్ట్ కే లో భాగం కానున్నట్టు కన్ఫర్మ అయ్యింది.మరి ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అనేది తెలియల్సి ఉంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కు క్యూరియాసిటీ పెరుగు తుంది.
మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి అయ్యి రిలీజ్ అవుతుందో చూడాలి.







