ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఇండస్ట్రీ హిట్ ను అందుకోవడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయి లో రామ్ చరణ్ కు స్టార్ డమ్ దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన ఆ సినిమా లో రామ రాజు పాత్ర లో రామ్ చరణ్ నటించి మెప్పించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పర్చింది.
ఆ సినిమా సక్సెస్ జోష్ లో ఉండగానే ఈయన నటించిన ఆచార్య సినిమా విడుదల అయ్యింది.ఆచార్య సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.
అయితే ఆచార్య లో కేవలం చరణ్ గెస్ట్ రోల్ అవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజీ ఈయనకు జరగలేదు.
ఇప్పుడు శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను ఈయన చేస్తున్నాడు.
ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది.శంకర్ దేశం లోనే గొప్ప దర్శకుడు అనడంలో సందేహం లేదు.
అలాంటి ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిజమైన పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ఈ సినిమా లో చరణ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఆ విషయమై ఇంకా క్లారిటీ రాకుండానే అప్పుడే ట్రిపుల్ రోల్ అంటూ ప్రచారం మొదలు అయ్యింది.

దాంతో మెగా అభిమానులు సినిమా లో చరణ్ పాత్ర డబుల్ రోల్ అయ్యి ఉంటుందా లేదంటే ట్రిపుల్ రోల్ లో ఆయన కనిపించబోతున్నాడా అంటూ చర్చించుకుంటున్నారు.అసలు విషయం ఏంటీ అంటే ఈ సినిమా లో చరణ్ ను రెండు విభిన్నమైన పాత్రలో శంకర్ చూపించబోతున్నాడు.మూడవ పాత్ర అనేది పూర్తిగా అవాస్తవం అంటూ యూనిట్ సభ్యుల నుండి అనధికారిక క్లారిటీ అందుతోంది.
ఈ సినిమా ను సెప్టెంబర్ వరకు పూర్తి చేసేలా దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.







